మహిళా కానిస్టేబుల్‌పై ఇన్స్పెక్టర్ లైంగికదాడి.. సస్పెన్షన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెండయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలీఘర్కు చెందిన రాకేశ్ యాదవ్ క్రైంబ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తానున్న హోటల్ గదికి తీసుకురావల్సిందిగా ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే ఆమె భయాన్ని అలుసుగా తీసుకున్న రాకేశ్ యాదవ్.. ఆమెకు ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. దాంతో సహనం కోల్పోయిన ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇన్స్పెక్టర్ రాకేశ్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. కాగా, మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడికి పాల్పడిన ఇన్స్పెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఎస్సీ.. రాకేశ్‌యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.