ఘనంగా నిహారిక వివాహం
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నిహారిక-చైతన్య
మెగా వారసురాలు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జన్నల గడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశారు. బుధవారం రాత్రి ఈ వివాహ వేడుకకు జైపూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్ వేదికైంది. ముహూర్తం వేళ పెళ్లి కుమార్తె నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు వదూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.