హద్దులు దాటను!

‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. ‘వెంకీ మామ’ విజయంతో నా పట్ల వాళ్ల అభిమానం రెట్టింపైంది. నా తొలిచిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదల తరువాత అందరూ నన్ను ఓ రాణిలా చూశారు.’ అని చెప్పింది పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది. అయితే తొలినుంచి గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్న ఈ అందాలభామతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ‘నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ నాకు లభించిన పాత్రలు చేస్తూ వస్తున్నాను. గ్లామర్‌ పాత్రలు పోషించినా ఎప్పుడూ నేను హద్దులు దాటను. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. నా కెరీర్‌ ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్‌లో తప్పకుండా అన్ని జోనర్‌ సినిమాలు, అని తరహా పాత్రలను పోషిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Leave A Reply

Your email address will not be published.