అదిలాబాద్–నిర్మల్ పిసిసిసి అబ్జర్వర్‌గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి (CLiC2NEWS): అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు పిసిసి అబ్జర్వర్‌గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పిసిసి నూతన కమిటీల ఏర్పాటుతోపాటు పార్టీ కార్యకలాపాల సమన్వయ బాధ్యతలను అప్పగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే మ‌నంద‌రి లక్ష్యమని పేర్కొన్నారు.

Also Read: బ‌స్ భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. భారీగా చేరుకున్న బిఆర్ ఎస్ శ్రేణులు

Leave A Reply

Your email address will not be published.