AP: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, పింఛ‌నుదారుల‌కు రెండు డిఎలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు పింఛ‌నుదారుల‌కు శుభ‌వార్త‌నందించింది. ఎపి ప్ర‌భుత్వం శుక్ర‌వారం రెండు డిఎలు విడుద‌ల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, పింఛ‌నుదారుల‌కు రెండు డిఎలు విడుద‌ల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. పెంచిన డిఎల‌ను సెప్టెంబ‌ర్ జీతానికి క‌లిపి చెల్లించాల‌ని పేర్కొంది. 1.82% డిఎను 2025 , జ‌న‌వ‌రి 1 నుండి చెల్లించ‌నుంది. మొత్తం 20 నెల‌ల బకాయిలు 2028 జ‌న‌వ‌రి, మార్చి , మే, జులైలో ఇవ్వ‌నుండి . అదేవిధంగా 2.73% డిఎను 2024 జులై 1 నుండి చెల్లించ‌నుంది. 26 నెల‌ల బ‌కాయిల‌ను 2027 ఏప్రిల్, జూన్‌, ఆగ‌స్టు, అక్టోబ‌ర్‌లో జ‌మ‌చేయ‌నుంది.  ఇదే షెడ్యూల్‌లో పింఛ‌నుదారుల‌కు కూడా డిఎ బ‌కాయిల‌ను చెల్లించాల్సిందిగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.