9వ త‌ర‌గ‌తి నుండి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం..

NMMS నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ 2026.

9వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ ఆర్ధికంగా వెనుక‌బ‌డిన‌, ప్ర‌తిభావంతులైన విద్యార్థులు ఒక్క ప‌రీక్ష‌తో స్కాల‌ర్ షిప్ పొంద‌వ‌చ్చు. నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ 2026 ప‌థకాన్ని కేంద్ర ప్ర‌భుత్వం (భార‌త ప్ర‌భుత్వ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్ర‌యోజిత నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం ప్రారంభించింది.) అమ‌లు చేస్తుంది.

ప్ర‌తి ఏడాది దేశం అంత‌టా ఒక ల‌క్ష మంది విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్ అందిస్తున్నారు. వీరిలో ఎపికి 4,087 స్కాల‌ర్‌షిప్‌ల‌ను కేటాయించారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను ఎపి డైకెక్ట‌రేట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎగ్జామినేష‌న్స్ (ఎపి బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌) విభాగం విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వ‌/ స్థానిక సంస్థ‌లు/ మున్సిప‌ల్ / ఎయిడెడ్ పాఠ‌శాల‌లు/ మోడ‌ల్ పాఠశాల‌ల్లో ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల కోసం ప‌రీక్ష‌ను నిర్వ‌హించి ఉప‌కార‌వేత‌నం (స్కాల‌ర్‌షిప్)ను అందిస్తున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా ఏడాదికి రూ. 12వేల ఆర్ధిక ప్రోత్సాహం అందుతుంది. 9వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ఈ స్కాల‌ర్షిప్ అందుకోవ‌చ్చు.

  • అర్హ‌త‌లు : 7వ త‌ర‌గ‌తిలో 55% మార్కులు పొందిన విద్యార్థులు ఈ NMSS ప‌రీక్ష‌కు అర్హులు. తుది ఎంపిక నాటికి 8వ త‌ర‌గ‌తిలో 55% మార్కులు పొంది ఉండాలి.
    ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్‌, స్థానిక సంస్థ‌ల పాఠ‌శాల‌ల్లో రెగ్యుల‌ర్ విధానం లో చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు.
    ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 కు మించ‌రాదు.

 

  • ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 100 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి / ఎస్‌టి విద్యార్థులు రూ.50 చెల్లించాలి. ఫీజు ఎస్‌బిఐ చ‌లానా రూపంలో జ‌త‌చేయాలి.
    రాష్ట్ర ప్ర‌భుత్వ సెకండ‌రా ఎడ్యుకేష‌న్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా స్కూళ్లు స‌మ‌ర్పించారు. అనంత‌రం వాటిని ప్రింట‌వుట్ల‌ను, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను డిఇఒల‌కు పంపించాలి. ద‌ర‌ఖాస్తుల‌ను అక్టోబ‌ర్ 12వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.

 

  • రాత ప‌రీక్ష ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. విద్యార్థుల‌కు రెండు పేప‌ర్ల రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
    ప‌రీక్ష -1 మెంట‌ల్ ఎబిలిటి టెస్ట్ (మ్యాట్‌) – 90 మార్కులు
    ప‌రీక్ష -2 స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్ )- 90 మార్కులు
    రెండు ప‌రీక్ష‌లు మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.

 

  • రాష్ట్రంలోని 28 జిల్లాల‌కు చెందిన 8వ త‌ర‌గ‌తి విద్యార్థులకు — ఈ ప‌రీక్ష‌ను 15-112026 ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్వ‌హిస్తారు. అన్ని రెవెన్యూ డివిజన‌ల్ ప్ర‌ధాన కేంద్రాల్లో తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాధ్య‌మాల‌లో నిర్వ‌హిస్తారు.

Educational News: ఇంజినీరింగ్ చ‌దివే బాలిక‌ల‌కు రూ. 50వేల‌ స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం..

Leave A Reply

Your email address will not be published.