కోర్టు భ‌వ‌నంపై నుండి దూకి కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఒక‌రు మృతి

మెద‌క్ (CLiC2NEWS): మెద‌క్ జిల్లా కోర్టు భ‌వ‌నంపై నుండి ఓ కుటంబం దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో ఒక‌రు మృతి చెంద‌గా ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. శ‌నివారం రాత్రి ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి త‌ల్లిదండ్రులు కోర్టు భ‌వ‌నంపై నుండి కిందికి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందగా.. తీవ్ర‌గాయాలైన ముగ్గురిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే వారు ఎందుకు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశార‌న్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.