India: కాస్త తగ్గిన కొత్త కేసులు.. పెరిగిన మరణాలు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్రం మంగ‌ళ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1761 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,80,530కి చేరింది. ప్ర‌స‌త్తుతం దేశంలో 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.