ఈ నెల 26న భారత్ బంద్..
ఢిల్లీ :ఓవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగిస్తుండగా భారత్ బంద్‌కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు దాదాపు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు పలికాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని సమీక్షించాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొత్త ఈ-వే బిల్లు విధానాన్ని, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోనియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ఏకరీతిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీడబ్ల్యూఏ డిమాండ్ చేస్తోంది.
ముఖ్యమంగా చమురు ధరలు, జీఎస్టీ, ఈ-వే బిల్లులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానంగా భారత్ బంద్‌కు వెళ్తున్నారు.. ఈ-వే బిల్లు విధానాన్ని, కొత్త నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు మద్దతిస్తున్నాయి.. డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండాలని.. వరుసగా పెరిగిపోతున్న డీజిల్ ధరలకు కళ్లెం వేసి.. తగ్గించాలని కోరుతున్నారు. ఇక, ఇప్పటికే ప్రధాని మోడీకి సీఏఐటీ లేఖ రాసింది జీఎస్టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-టెయిలర్స్.. ఈ-కామర్స్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సర్కార్‌కు కొత్త సిఫారసులు చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది.
ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య మాట్లాడుతూ, అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతిస్తున్నట్లు ధ్రువీకరించాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఒక రోజు బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండాలన్నారు. డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు.