ఎపిలో కొత్త‌గా 79 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త 24 గంట‌ల్లో 79 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే కొవిడ్‌-19 వైరస్‌ బారినపడి చికిత్సకు కోలుకొని 77 మంది ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గ‌డిచిన 24 గంట‌ల్లో వైజాగ్‌లో కోవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 7,167 మంది మృత్యువాత పడ్డారు. కాగా రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 8,89,156 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వారిలో 8,81,369 మంది చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఇప్పుడు మరో 620 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.