ఎపిలో 947 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 40,604 సాంపిల్స్ పరీక్షించగా 947 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. అలాగా తాజాగా మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 885892కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 897810కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనా కారణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. కాగా ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.