ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో

అమ‌రావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ `పోస్కో` వెల్లడించింది. సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.