ఒకే ఊరిలో 33 మందికి క‌రోనా

క‌రీంన‌గ‌ర్: జిల్లాలో కరోనా కల్లోలం రేపుతోంది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారిలో 33 మందికి కరోనా పాజిటివ్ రావడం ప్రజల్లో కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు రోజులు శిబిరం ఏర్పాటు చేసి గ్రామ‌స్థుల‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా మొద‌టి రోజు 16 కేసులు రాగా, రెండో రైజు శుక్ర‌వారం 17 మంది కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో గ్రామంలో మొత్తం 33 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని హెల్త్ సూప‌ర్‌వైజ‌ర్ బాల‌య్య తెలిపారు. అవారంద‌రినీ హోం ఐసోలేష‌న్‌లో ఉంచి అవ‌స‌ర‌మైన చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు వారికి అవ‌స‌ర‌మైన స‌రుకుల‌న స‌మ‌కూర్చుతున్నారు.

కాగా చేగుర్తి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వయసున్న దుర్గం కనకయ్య పదిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల్లో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరు అనారోగ్యానికి గురికాగా కోవిడ్ పరీక్షల్లో అతని కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో అంత్యక్రియలకు హాజరైన వాళ్లలో గుబులు రేపింది. అయితే… అంత్యక్రియలకు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది. గత గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షలు నిర్వహించగా గ్రామంలో మొత్తం 33 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య అధికారులు చెబుతున్నారు. కేవలం అంత్యక్రియలకు హాజరైన వ్యక్తులకే వైరస్‌ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.