విమానాశ్రయంలో పట్టుబడ్డ 1.5 కిలోల విదేశీ బంగారం
జైపూర్: షార్జా నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని జైపూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. అధికారుల తనిఖీల్లో షార్జా నుంచి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో ప్రయాణికుడి వద్ద 1.5 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని రెండు ముక్కలుగా చేసి తన బూట్లలో పెట్టుకున్నాడని అధికారులు తెలిపారు. తనిఖీల్లో బయటపడిన 1.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశామని, మార్కెట్‌లో దాని విలువ రూ. 70 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.