కరోనాతో వీణవంక ఎఎస్‌ఐ మృతి

కరీంనగర్‌: జిల్లాలోని వీణవంక పోలీస్‌ స్టేషన్‌లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న గాదర్ల యాదగిరి (56) శివరాత్రి బందోబస్తు విధుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన వేములవాడకు వెళ్లాడు. 12న పెద్ద‌పెల్లిలోని ఇంటికి తిరిగివచ్చాడు. త‌రువాత‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో 13న క‌రీంన‌గ‌ర్‌లోని అపోలో ద‌వాఖాన‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 15న కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం యాదగిరి మృతి చెందాడు. ఆయన మృతికి ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి, ఠాణా సిబ్బంది సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.