కారు జోరు.. రెండో రౌండ్‌లోనూ ప‌ల్లా ఆధిక్యం..

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్..

హైద‌రాబాద్‌/న‌ల్ల‌గొండ‌: ఎమ్మెల్సీ పోరులో కారు జోరు కొన‌సాగుతోంది. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఫస్ట్‌ రౌండ్‌లో సత్తా చాటిన పల్లా.. రెండో రౌండ్‌లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్‌లో మొత్తం 56వేల 3 ఓట్లలో .. పల్లాకు 15 వేల 857 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 12 వేల 70 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. థర్డ్‌ ప్లేస్‌లో కోదండరామ్‌కు 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లతో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పల్లా 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మొద‌టి రౌండ్‌లో…

తొలిరౌండ్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 16వేల 130 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 12వేల 46 ఓట్లు.. కోదండరామ్‌కు 9వేల 80 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి నాలుగు, కాంగ్రెస్ క్యాండెట్‌ రాములు నాయక్‌ ఐదో స్థానంలో కొనసాగారు. రెండో రౌండ్‌లోనూ మళ్లీ పల్లానే ఫస్ట్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

1054 ఓట్ల ఆధిక్యంలో సుర‌భి వాణీదేవి

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 17 వేల 439 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 16,385, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 8,357, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోల‌య్యాయ‌. 799 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ ప‌త్రాల‌ను 8 హాళ్ల‌లో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. మూడు షిప్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.