కౌంటింగ్: రెండో రౌండ్‌లోనూ వాణీదేవి ఆధిక్యం
హైదరాబాద్: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటిగ్ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 17,732, బీజేపీకి 16,173, నాగేశ్వర్ 8,594, కాంగ్రెస్‌కు 4,980 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై 2,613 ఓట్లతో ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. అలాగే ఈ రెండో రౌండ్‌లోనూ 3,375 ఓట్లు చెల్లలేదు. రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 35,171 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 32,558 ఓట్లు వచ్చాయి.
అలాగే నల్లగొండ – వరంగల్- ఖమ్మం పట్టభ్రదుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసే సరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ, టిఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 17,393 ఓట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 13,122 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇక 11,907 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం మూడు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12,142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.