గజ్వేల్లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
గజ్వేల్: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. నూతన భవనం నిర్మించేందుకు సెల్లార్ తీస్తుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి ముందే ఆ భవనంలో ఉన్న 10 మంది బోరుబండి కార్మికులు వెళ్లిపోయారు. లేకపోతే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
