తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,097 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1715 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనాతో తాజాగా ఒక్కరు కూడా మరణించలేదు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 84,33,333 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు.