తొలిరౌండ్లో ఆధిక్యం దిశగా పల్లా రాజేశ్వర్రెడ్డి
నల్లగొండ: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. అధికారులు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టాల్సి ఉండగా తొలిరౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. ద్వితీయస్థానం కోసం ప్రొ.కోదండరాం, తీన్మార్ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు సమాచారం. నాలుగు, ఐదు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
సగానికి పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి
- తొలి రౌండ ఓట్ల లెక్కింపులో చెల్లిన 45,000 ఓట్లలో పల్లా రాజేశ్వరరెడ్డి 26,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
- రెండవ స్థానంలో కోదండరాం, మూడవ స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు.
- ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 56 వేల ఓట్లలో చెల్లనవి 8,000 గా అధికారులు ప్రకటించారు. 45వేల ఓట్లు చెల్లాయి.