తోట త్రిమూర్తులను ప్రశంసించిన జ‌గ‌న్‌

మండపేట: మండపేట నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ చార్జి తోట త్రిమూర్తులను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం అంతర్వేది వచ్చిన సీఎం జగన్ ను తోట మర్యాద పూర్వకంగా కలిసారు. 43 పంచాయతీలకు 33 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు సర్పంచులుగా గెలు పొందారని వివరించారు. ప్రభుత్వం ప్రజారంజక పాలనతోనే ఘన విజయం సాధించగలిగామని అధినేత దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారని తోట తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.