దేశంలో కొత్తగా 10,584 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో 10,584 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 13,255 మంది కొత్తగా డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో 78 మంది మృత్యువాత పడ్డారని బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 1,56,463 మంది బలయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,16,434కి చేరింది. వారిలో 1,07,12,665 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,306 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.