ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యావంతుల ఆత్మహత్యలు బాధాకరం: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు
కామారెడ్డి: నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం బాధాకరమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటన్నిటికీ కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే అని తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు గొప్పలు చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యమాలు చేయండి అని అంటే ఆవేశానికి పోయి కుటుంబాలను దూరం చేసుకొని లాఠీ దెబ్బలు తిని ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి త్యాగాలతో నేడు కేసీఆర్ కుటుంబంలోని వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, రాష్ట్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జేఎల్,గ్రూప్ 1నోటిఫికేషన్ కానీ డిఎల్ నోటిఫికేషన్ కానీ విడుదల చేయలేదని,ఈ ప్రభుత్వానికి విద్యార్థుల, నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచడంతో కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్ధిగా కొనసాగుతున్న సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడము ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిదర్శనం అన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. నోటిఫికేషన్లు జారీ చేసే వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంజల్ రెడ్డి, సతీష్, ప్రశాంత్, రాజు, నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది.