ఫేస్‌బుక్‌కు అంఖిదాస్‌ రాజీనామా

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ అంఖిదాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలపై పక్షపాతంగా వ్యవహరించారన్న వివాదాల్లో ప్రముఖంగా ఆమె పేరు వినిపించిన సంగతి మ‌న‌కు తెలిసిందే. కాగా, ఆమె తన పదవికి రాజీనామా చేశారని రాయిటర్స్‌ మంగళవారం పేర్కొంది. సమాచార గోప్యతకు సంబంధించిన అంశంపై ఫేస్‌బుక్‌ సంస్థతో పాటు ఆమె ఇటీవల పార్లమెంటరీ ప్లానింగ్‌ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా విచారించినట్లు మీడియా వెల్లడించింది. కాగా వారం అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, ఫేస్‌బుక్‌కు దేశవ్యాప్తంగా 300మిలియన్‌ల వినియోగదారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.