బావిలో నుంచి జీపు వెలికితీత
సంగెం: జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల వద్ద అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో…. నీటిలో పడిన జీపును క్రేన్ సాయంతో పోలీసులు వెలికితీశారు. జీపుతో పాటు డ్రైవర్ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. మృతుడు ఏనుగల్లుకు చెందిన డ్రైవర్ సతీష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏసీపీ శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ.. స్థానికులు, పోలీసు సిబ్బంది సహాయంతో జీపు నుంచి 10 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారన్నారు. జీపు డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు బావిలోనే మృతిచెందినట్లుగా భావిస్తున్నామన్నారు. డ్రైవర్ మృతదేహం వెలికితీయగా మిగతా వారి ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
తప్పకచదవండి:గవిచర్ల వద్ద ప్రయాణికులతో సహా బావిలో పడ్డ జీపు

