మన అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి : చిరు
ఈ రోజు (గురువారం, అక్టోబరు 29) మెగాబ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, దయగల హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి, నా సోదరుడు నాగబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి తన ట్వీటర్ ద్వారా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు తమ్ముళ్లు పవన్, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక అన్నయ్య బర్త్డే ట్వీట్కు స్పందించిన నాగబాబు..‘థ్యాంక్స్ అన్నయ్య.. నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే మెగా అల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ కూడా మామయ్య నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుకి బర్త్డే విషెష్ తెలియజేశారు.
Thanks annayya..I am always be with you https://t.co/QlNO4vFA89
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 29, 2020