మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్‌

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా బి. సింగవరంలో బుధవారం రోజు ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్ది భర్త శామ్యూల్‌పై చింతమనేని, ఆయన అనుచరులు దాడిచేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఫిర్యాదు మేరకు స్పందించిన పెదవేగి పోలీసులు గురువారం మధ్యాహ్నం చితమనేనిని అరెస్ట్‌ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపరచున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 341,324,143, 323, 354, 354a,171సీ, 506(2), 455 R/w 149 కింద కేసు నమోదు చేశారు. కాగా కేసుతో సంబంధం లేకున్నా చింతమనేనిని అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో చింతమనేనిని తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.