`సుప్రీం` జడ్జిలకు రేపటి నుంచి టీకా
న్యూఢిల్లీ: దేశంలో రెండో దశ కరోనా టీకా పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి మోడీ సహా పలువురు ప్రముఖులు కూడా నేడు (సోమవారం) వ్యాక్సిన్ వేయించుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిలకు మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్‌లలో నుంచి ఏదో ఒకదానికి ఎంపిక చేసుకునే అవకాశం జడ్జిలకే కల్పించారు. న్యాయమూర్తులకే కాకుండా వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ జడ్జిలకు కూడా వ్యాక్సిన్లు వేయనున్నారు. సుప్రీంకోర్టు ఆవరణలోనే రిజిస్ట్రీ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వసతి కల్పించింది. లేదా ప్రభుత్వ జాబితాలో ఉన్న ఏ ఆసుపత్రిలో అయినా జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యులు వ్యాక్సిన్లు వేసుకోవచ్చు.