అజ్మీర్ ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాలు.. శుభాకాంక్ష‌లు తెలిపిన కెసిఆర్‌

హైద‌రాబాద్: అజ్మీర్ ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాల సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు తెలంగాణ సిఎం కె చంద్ర‌శేఖ‌ర‌రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాల్లో స‌మ‌ర్పించే చాద‌ర్ (గిలాఫ్‌)కు కెసిఆర్ న‌మ‌స్క‌రించి అజ్మీర్‌కు పంపారు. ప్ర‌త్యేకంగా రూపొందించిన చాద‌ర్‌ను కెసిఆర్‌ ముందు ఉంచి ముస్లిం మ‌త పెద్ద‌లు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ స‌లీం, ఎమ్మెల్యే ష‌కీల్‌, ఎమ్మెల్సీలు మ‌హ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్‌, ఫారూఖ్ హుస్సేన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.