ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలి: మంత్రి ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రి ‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

అలాగే కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని మంత్రి ఈట‌ల తెలిపారు. ఇప్పటికే రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం… కొవిడ్‌ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని అధికారుల‌కు తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.