మహారాష్ట్రలో కొత్తగా 15,602 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,602 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా 88 మంది కోవిడ్‌తో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,97,793కు చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 52,811కు చేరింది. అలాగే తాజాగా గత 24 గంటల్లో 7,467 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,18,525 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ముంబయి నగరంలో ఈ ఏడాదిలో గరిష్ఠంగా 1,709 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.