ఎపిలో కొత్తగా 218 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 218 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేర‌కు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 892740కు చేరింది. ప్రస్తుతం 1795 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా ఇప్పటి వరకు 883759 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7186కు చేరింది. క‌రోనా కొత్త‌గా ఎటువంటి మరణం సంభవించలేదని బులిటెన్‌లో అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.