ఎపిలో కొత్త‌గా 2,765 కరోనా కేసులు

అమ‌రావతి: ఆంధ్రప్రదేశ్ లో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 2,765 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రం ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 8,94,896 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 16,422 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,279 కి చేరిందని అధికారులు పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.