ఢిల్లీ ఎయిమ్స్‌లో 35 మంది వైద్యులకు కరోనా పాజిటివ్!‌

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. క‌రోనా సామాన్యుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను, సినీస్టార్స్‌, సామాన్యుల‌నే కాకుండా డాక్ట‌ర్ల‌కు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం పలు టీవీల్లో వార్తలు వచ్చాయి.

మరోవైపు ఢిల్లీలోని మరో ప్రముఖ గంగా రామ్‌ ఆసుపత్రిలో గురువారం 37 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులని, తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

క‌రోనా సోకిన వారిలో 32 మంది వైద్యులు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఐదుగురు మాత్రం ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాయి.

Leave A Reply

Your email address will not be published.