ఎపిలో కొత్త‌గా 70 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో గ‌త 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,268 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 70 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా గ‌డిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 7168 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 84 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 886514 కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 878771కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 575 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు అధికారులు బులిటెన్‌లో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.