ఎపి కొత్త ఎస్ఇసిగా నీలం సాహ్ని

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త ఎన్నికల కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్రవేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకుంటారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తుండటంతో ఏపీ సర్కారు ఈ నియామకం చేపట్టింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె పదవి కాలం ముగియడంతో సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.