ఒడిశాలో రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

భువనేశ్వర్‌ : ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కోట్‌పాడ్ వ‌ద్ద ఆదివారం అర్ధరాత్రి అదుపు తప్పి వ్యాన్‌ బోల్తాపడింది. ఈ ప్ర‌మాదంలో 9మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌మాద విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స్థానిక సింధుగూడ గ్రామం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుల్తా గ్రామానికి వెళ్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకంద‌ని జిల్లా కలెక్టర్‌ మధుసూదన్‌ మిశ్రా వివ‌రించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, బోల్తాపడిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.