ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ విజయం

అమరావతి: తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1,534 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పీఆర్టీయూ/ ఎస్టీయూ బలపరిచిన అభ్యర్థి గంధం నారాయణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ, చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సాబ్జీ విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 16,054 ఓట్లు పోలవగా ఇందులో 363 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 15,691 ఓట్లలో షేక్‌ సాబ్జీకి 7,987.. నారాయణ రావుకు 6,453 ఓట్లు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.