తెలంగాణకు వర్ష సూచన‌..

హైద‌రాబాద్‌: వ‌చ్ప‌చే మూడు రోజులు (15, 16, 17వ తేదీల్లో) తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం వుంది. బుధ‌వారం (నిన్న) ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడింది. కాగా ఇవాళ మ‌హారాష్ట్రలోని విదర్భలో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే కేరళ తీరం నుండి ఉత్తర కర్ణాటక వరకు దక్షిణ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. వీటి ప్ర‌భావంతో రానున్న మూడు రోజులుల‌లో తెలంగాణ‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది.

Leave A Reply

Your email address will not be published.