తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1685 కి చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. వీటిలో 2,99,878 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,241 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.