భారీ స్కోరు చిత్తు.. రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ విజయం

పుణే: తొలి వన్డేలో గెలిచి ఊపుమీదున్న టీమిండియాకు ఇంగ్లండ్ షాక్ ఇచ్చింది. పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని సైతం ఈజీగా ఇంగ్లండ్ జ‌ట్టు బీట్ చేసింది. రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం అయింది. మరో వన్డే మిగిలి ఉంది.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా… రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో రీస్ టాప్లీ, టామ్ కరన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం 337 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సునాయసంగా విజయం సాధించింది. కేవలం 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జేసన్ రాయ్ 55 పరుగులు సాధించ‌గా.. బెయిర్ స్టో 124 పరుగులతో చెలరేగాడు. రెచ్చిపోయిన బెన్ స్టోక్స్ కేవలం 52 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో భార‌త బౌల‌ర్ల‌పై విరిచుకుపడి 99 పరుగులు సాధించాడు. సెంచరీ మాత్రం మిస్ అయ్యాడు. ఇక, చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ 27, డేవిడ్ మలాన్ 16 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.