మంచిర్యాల: ప్రైవేటు టీచ‌ర్ల‌కు 13 క్వింటాళ్ల బియ్యం పంపిణీ

మంచిర్యాల‌: డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేడ్క‌ర్ 130వ జ‌యంతి పుర‌స్క‌రించుకుని బుధ‌వారం మంచిర్యాల ప‌ట్టణంలో ల‌య‌న్స్‌క్ల‌బ్ ఆఫ్ మంచిర్యాల గౌత‌మి ఆధ్వ‌ర్యంలో ప్రైవేటు టీచ‌ర్ల‌కు 13 క్వింటాళ్ల బియ్యం పంపిణీచేశారు. ప‌ట్ట‌ణంలోని ఫ్లైఓవ‌ర్ వ‌ద్ద‌గ‌ల శ్రీ స‌ర‌స్వ‌తి శిశుమందిర్ పాఠ‌శాల‌లో ఘ‌నంగా అంబేడ్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం క‌రోనా సెకండ్ వేవ్ మూలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 52 మంది ప్ర‌యివేటు ఉపాధ్యాయుల‌కు ఒక్కొక్క‌రికి 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ డైరెక్టర్‌ తన్నీరు మధుకర్‌ మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు జీతాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. వీరిని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు. తమ వంతు సాయం 13 క్వింటాళ్ల బియ్యం అందజేస్తామని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ అధ్య‌క్షులు ఎడ్ల శ్రీ‌నివాస్‌, కార్య‌ద‌ర్శి ఒద్దుల రాజేంద‌ర్‌, కోశాధికారి బేర న‌గేశ్‌, రిజియ‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ కృష్ణ‌మూర్తి, జోన్ చైర్మ‌న్ రాజ‌మౌళి, చార్ట‌ర్ ప్రెసిడెంట్ ఉస్క‌‌మ‌ల్ల రాజేంద్ర‌ప్ర‌సాద్‌, , డిసిలు పున్నం చందు, చంద్ర‌మోహ‌న్ గౌడ్‌, చ‌క్ర‌ధ‌ర్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అలాగే ఈ కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ డైరెక్ట‌ర్ త‌న్నీరు మ‌ధూక‌ర్ కూతురు దివిషాశ్రీ పుట్టిన రోజును పురస్క‌రించుకుని మాస్కుల‌ను, శానిటైజర్లు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.