మార్చి 31 వరకు తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు
చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా, గత 24 గంటల్లో తమిళనాడులో 486 మంది కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అలాగే కరోనాతో చికిత్సపొందుతూ ఐదుగురు మృతిచెందారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా మహమ్మారి విస్తృతిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అందరూ మాస్కులు ధరించేలా, సామాజిక దూరం, శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలకు తన ఆదేశాల్లో సూచనలు చేసింది.