యుపి ముఖ్య‌మంత్రి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్

ల‌ఖ్‌న‌పూ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సిఎం యోగి ఆదిథ్య‌నాథ్ క‌రోనా బారిన పడ్డారు. త‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొవిడ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు సిఎం వెల్ల‌డించారు ఈ విషయాన్ని స్వయంగా సీఎం యోగి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే తాను కోలుకుని.. ప్రజల ముందుకు వస్తానని సీఎం యోగి పేర్కొన్నారు.

అఖిలేశ్ యావ్‌కూ.. క‌రోనా
మ‌రోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు కూడా క‌రోనా సోకింది. ఇటీవ‌ల హ‌రిద్వార్ కుంభ‌మేళాలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయ‌గా క‌రోనా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటె, ఉత్తర ప్రదేశ్ లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 100 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాలని కూడా యోగి నిర్ణయం తీసుకున్నారు

Leave A Reply

Your email address will not be published.