రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ శుభవార్త వినిపించారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన పిఆర్‌సి ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ సభలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపత్యంలో పిఆర్‌సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ప్రత్యక్షంగా రూ. 52 వేలకోట్ల ఆదాయం కోల్పోయామని, అలాగే పరోక్షంగా రూ. 50 వేల కోట్ల ఆదాయం నష్టపోయామని చెప్పారు. మన రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం అతలాకుతలమైందన్నారు.
శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం చెప్పారు. `మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. దాన్ని అమలు చేస్తున్నాం.. తాను ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తాం. ఉ్యదోగులపై టిఆర్ ఎస్ వైఖరి ఎలా ఉందో దేశమంతా తెలుసుకుంటుంది.` అని కెసిఆర్ అన్నారు.
.