వకీల్ సాబ్ దర్శక నిర్మాతలకు మెగాభినందనలు
వకీల్ సాబ్ చిత్రం పవర్ ప్యాక్డ్ బ్లాక్టర్ హిట్ సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. `వకీల్‌సాబ్` టీం శనివారం చిరంజీవిని కలిసింది. వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. దిల్ రాజు, శ్రీరామ్ వేణులని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఆయనను వెండితెరపై చూసేందుకు జనాలు చాలా ఉత్సాహం చూపించారు. శుక్రవారం రాత్రి చిరంజీవి తన తల్లి, కుటుంబ సభ్యులతో ఏఎంబీ మాల్‌కు వెళ్లి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని చూశారు. సినిమాపై తన అభిప్రాయాన్ని కూడా ట్వీట్ రూపంలో తెలిపాడు. అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుపై తనదైన శైలిలో స్పందించారు.
ఈరోజు ఈ చిత్రం నిర్మాత దిల్ రాజును, దర్శకుడు వేణు శ్రీరామ్ ను చిరంజీవి తన ఇంటికి పిలిపించుకున్ని మరీ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ‘వకీల్ సాబ్’ మూవీలో తనకు నచ్చిన, తన ఫ్యామిలీ సభ్యులు మెచ్చిన సన్నివేశాలను వారిరువురికీ చిరంజీవి తెలియచేశారు.
Megastar @KChiruTweets congratulates producer #DilRaju and director #SriramVenu on the blockbuster of #VakeelSaab@PawanKalyan @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @MusicThaman pic.twitter.com/Q7e01T98xH
— BARaju (@baraju_SuperHit) April 10, 2021