వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి కరోనా పాజిటివ్
వికారాబాద్: జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో శుక్రవారం చైర్‌పర్సన్ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు.