తెలంగాణలో 3 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 2 వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 3 వేలకు చేరువలో నమోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 2909 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. నిన్నటి రోజున 584 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా డిశ్చార్జిల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,04,548 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 17,791 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1752కి చేరిందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.