షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్‌: విద్యా సంస్థ‌లు బంద్ ఉన్న‌ప్ప‌టికీ జెఎన్‌టియు, ఉస్మానియా వ‌ర్సిటీ, కాక‌తీయ వ‌ర్సిటీ ప‌రిధిలో ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల బంద్‌నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆయా వ‌ర్సిటీలు క్లారిటీ ఇచ్చాయి. కొవిడ్ వ‌ల్ల ప‌రీక్ష‌లు రాయ‌లేని వారికి ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని జెఎన్‌టియు రిజిస్ట్రార్ తెలిపారు. ప్ర‌త్యేక ప‌రీక్ష‌ను రెడ్యూల‌ర్ ప‌రిగ‌ణిస్తామ‌ని తెలిపారు. పిజి, బిటెక్ సెమిస్ట‌ర్ ప‌రీక్షలు జ‌రుగుతున్నాయ‌ని, బుధ‌వారం నుంచి డిగ్రి సెమిస్ట‌ర్ ప‌రీక్షలూ ప్రారంభం కానున్నాయ‌ని అధికారులు తెలిప‌రు. ఒయు ప‌రిధిలో రేపు జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు వ‌ర్సిటీ కంట్రోల‌ర్ వెల్ల‌డించారు. కాక‌తీయ వ‌ర్సిటీ ప‌రిధిలో జ‌ర‌గ‌నున్న ఎం ఫార్మ‌సీ, బీ ఫార్మ‌సీ, హోట‌ల్ మేనేజ్‌మెంట్ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగ‌నున్నాయి.

Leave A Reply

Your email address will not be published.