హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో వాతావారణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, అమీర్‌పేట్, సనత్‌నగర్, బేగంపేట్‌లో భారీ వర్షం కురవగా అబిడ్స్, బషీర్‌బాగ్, కోఠి, నారాయణగూడ, నాంపల్లిలో జల్లులు కురిసాయి. రానున్న కొన్ని గంటల్లో నగరంలో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో జిహెచ్ ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే డీఆర్‌ఎఫ్ టీమ్స్‌ను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.